- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్లో నకిలీ క్రాకర్స్.. అధికారుల పర్యవేక్షణ శూన్యం...
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో దీపావళి సందర్భంగా ప్రజలు పేల్చే క్రాకర్స్ లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీపావళి పర్వదినం సందర్భంగా అమావాస్య రోజు చీకటి పై వెలుగు సాధించిన విజయంగా జరుపుకునే టపాకాయల పండుగలో అపశృతి దొర్లింది. ఆర్మూర్ మున్సిపల్ లో టపాకాయలు అమ్మే దుకాణదారుల పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువడంతో దుకాణాదారులు నకిలీ పటాకులను ప్రజలకు అమ్మారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హుస్నాబాద్ గల్లీకి చెందిన కలిగోట చిన్న కుమారుడు కలిగోట దినేష్ చంద్ర వాళ్లు కొనుగోలు చేసిన టపాకాయలైన పూలకుండీలను, భూ చక్రాలను కాలుస్తుండగా అవి అమాంతం పేలడంతో ప్రమాదం సంభవించింది. చిన్నారులు కాల్చే ఈ టపాకాయలు సైతం పేలడంతో బాలుడు దినేష్ చంద్ర చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. టపాకాయల దుకాణాల వ్యాపారులు నకిలీ క్రాకర్స్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ బాలుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. టపాకాయల దుకాణాల వ్యాపారస్తుల పై అధికారుల పర్యవేక్షణ కరువైందని వారు వాపోయారు.