SSC GD Constable Jobs: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 5 నుంచి ఎడిట్ ఆప్షన్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-02 17:19:14.0  )
SSC GD Constable Jobs: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 5 నుంచి ఎడిట్ ఆప్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర భద్రత బలగాల్లోని జనరల్ డ్యూటీ(GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. BSF, CISF, CRPF, SSB, SSF, ITBP, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి తదితర విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలు(Constable Jobs) ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషుల(Mens)కు 35,612 పోస్టులు; మహిళల(Womens)కు 3,869 పోస్టులు కేటాయించారు. 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ నోటికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గత అక్టోబర్ నెలలోనే ముగిసింది. అయితే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అటువంటి వారికోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ లో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్-5 అర్ధరాత్రి నుంచి నవంబర్ -7 రాత్రి 11 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చే ఎలాంటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని సృష్టం చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.gov.in/login అనే వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Advertisement

Next Story