- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Damodara Rajanarsimha: ఆ 15 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించాలి.. నర్సింగ్ కాలేజీలపై హెల్త్ మినిస్టర్ రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 15 నర్సింగ్ కాలేజీ(Nursing Colleges)ల్లో వెంటనే అడ్మిషన్లు(Admissions) ప్రారంభించాలని హెల్త్ మినిస్టర్(Health Minister) దామోదర రాజనర్సింహా(Damodara Rajanarsimha) పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్(HYD)లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్టాఫ్,సౌలత్ లపై రెండు రోజుల్లో రిపోర్టు తయారు చేయాలన్నారు. ఇప్పటికే క్లాసులు ప్రారంభమైన మెడికల్ కళాశాలలకు అనుబంధంగా 15 నర్సింగ్ కళాశాల లలో అడ్మిషన్ల ప్రక్రియ, తక్షణం సమకూర్చాల్సిన మౌలిక సదుపాయాల పై ఫోకస్ పెట్టాలన్నారు. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆందోల్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రి లలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తే విద్యార్ధులకు మేలు జరుగుతుందన్నారు. సీట్ల సంఖ్య పెరగడమే కాకుండా ఎక్కువ మందికి నర్సింగ్ అవకాశాలు లభిస్తాయన్నారు. అడ్మిషన్ల తర్వాత తరగతులను ప్రారంభించేలా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మీటింగ్ లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వి కర్ణన్, టీజీఎంఎస్ ఐడీసీ సంస్థ ఎండీ హేమంత్ సహదేవ్ రావులు పాల్గొన్నారు.