- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఐపీఎల్ 2025.. నేడు వాంఖడే స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ 18 రసవత్తరంగా కొనసాగుతోంది. చివరి ఓవర్ వరకు చేరుకుంటున్న మ్యాచులు ఏ జట్టు విజయం సాధిస్తుందో నన్న తీవ్ర ఉత్కంఠను నెలకోల్పుతున్నాయి. అలాగే ఈ ఐపీఎల్ సీజన్ (IPL season)లో అనేక రికార్డులు సైతం నమోదవుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా చిన్న జట్లు వరుస విజయాలను సాధిస్తూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. గతంలో అత్యధిక కప్పులను సాధించిన ముంబై, చెన్నై, కేకేఆర్, సన్‌రైజర్స్, రాజస్థాన్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో కింది స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే వరుస ఓటముల తర్వాత కీలక జట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో రోజు కీలక మైన మ్యాచ్ ముంబై, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరగనుంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో జరగనున్న ఈ మ్యాచ్ హై ఓల్టేజ్ నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇదే మైదానంలో సన్ రైజర్స్ (Sunrisers) జట్టు భారీ స్కోరు నమోదు చేసి గత చరిత్రను తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఈ రెండు జట్లు తలపడనుండటంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో ముంబై (Mumbai), సన్ రైజర్స్ జట్లు అంతగా రాణించలేక పోయాయి. కానీ సన్ రైజర్స్ జట్టు గెలిచిన రెండు మ్యాచుల్లో ఐపీఎల్ చరిత్రను తిరగరాసే స్కోర్లను నమోదు చేసుకుంది. దీంతో నేటి మ్యాచ్ పై భారీ అంచానలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై, చెన్నై, సన్ రైజర్స్ జట్లు వెంటవెంటనే పోటీ పడుతున్నాయి. ఈ వరుస మ్యాచుల్లో రెండు జట్లపై గెలిచిన జట్లు ప్లే ఆఫ్ రేసులో కొనసాగే అవకాశం ఉంది.
ముంబై అంచనా జట్టు: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (WK), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ
సన్‌రైజర్స్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఈషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కత్