- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trending Video: ఏందిరా అయ్యా.. ఇది ఇప్పట్లో ఆగేలా లేదుగా..

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కిన సినిమా ‘దేవర’(Devara). ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కూడా సృష్టించింది. అయితే ఈ మూవీ సీన్స్‌కంటే సాంగ్సే ఎక్కవ క్రేజ్ తెచ్చుకుంది.
అందులో చుట్టమల్లె(Chuttamalle) సాంగ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటికే ఈ పాట మీద సోషల్ మీడియా(Social Media)లో రీ క్రియేట్ చేస్తూ చాలా రీల్స్ వచ్చాయి. బేసిక్‌గా ఏదైన ట్రెండింగ్ సాంగ్ వచ్చినప్పుడు అది కొన్ని రోజులు వైరల్ అయి దాని ప్లేస్‌లో మరొకటి వచ్చినప్పుడు పాత దాన్ని అందరూ మర్చిపోతారు. కానీ దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ రోజు రోజుకు కొత్తది అయిపోతుంది.
ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అమ్మాయి పర్పుల్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా సేమ్ జాన్వీలా డ్యాన్స్ చేస్తుంది. ఇక ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసీ అక్కడున్న వాళ్లంతా ఓ అంటూ అరుస్తున్నారు. అలాగే ఆమె వెనుక ఉన్న లేడీస్ కూడా ఆ లిరిక్స్‌కు కూర్చోనే డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఏందిరా అయ్యా.. ఇది ఇప్పట్లో ఆగేలా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/Nikhil4Tarak/status/1912370564402160077
Read More..