- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డీడీ కట్టినా కూల్చివేస్తారా..!

దిశ, మానోపాడు : ఆర్టీసీ బస్టాండ్ కు మా గ్రామం నుండి 20 ఏళ్ల కిందట విరాళంగా స్థలాన్ని అందించామని మానోపాడు గ్రామస్తులు తెలిపారు. అందులోనే స్థలానికి ఇరువైపులా షాపులు వేసుకొని జీవనం సాగిస్తుంటే డీడీలు కట్టమని ఆర్టీసీ యాజమాన్యం ఒత్తిడి పెట్టడంతో ఒక్కొక్క షాప్ నుండి 5000 నుండి 10,000 లోపు డీడీలు చెల్లించి అనుమతులు తీసుకున్నామన్నారు. అయినా షాపులను కూల కొట్టడం ఎంత వరకు న్యాయమని ఆర్టీసీ అధికారుల పై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. మానోపాడు మండల కేంద్రంలో గత 24 ఏళ్ల కిందట ఆర్టీసీ డిపో కొరకు గ్రామస్తులే స్వయంగా రైతు సంఘం నుండి స్థలం కేటాయించారు. అప్పట్లోనే ఆ స్థలాన్ని ఆర్టీసీకి అప్పగించారు. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆర్టీసీ యాజమాన్యం ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలాలు లేవు.
కనీసం ఆర్టీసీ అభివృద్ధి కూడా చేసిన సందర్భం లేదు. గత ఆరు నెలలుగా ఆర్టీసీ యాజమాన్యం స్థలంలో షాపులు వేసి డెవలప్మెంట్ చేస్తామని, ప్రస్తుతం ఉన్నషాపు యజమానులు డీడీలు చెల్లిస్తే రెంటు కట్టి షాపులను నడుపుకోవచ్చు అని తెలియజేశారు. కానీ డీడీలు చెల్లించినా నేటి వరకు స్థలాలు సరిగ్గా చూపించకపోవడం, ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో షాపు రెంటులు కట్టలేదు. తాము ఉన్నచోట స్థలాలను కొలిచి ఇచ్చి షాపులు నడుపుకోవడానికి అనుమతి ఇస్తే షాపుల అద్దెలు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని బాధితులు వాపోయారు. ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా డీడీలు చెల్లించిన షాపులు ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న ఒక డబ్బా, ఓ మటన్ షాపు దుకాణాలను దౌర్జన్యంగా ఆర్టీసీ యాజమాన్యం వాళ్లు కూల్చివేయడంతో బస్టాండ్ ఆవరణలో జీవనం చేస్తున్న వారందరూ గట్టిగా వారించి, ఇలా కూల్చివేస్తారని వారితో వాదనకు దిగారు. సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రకాంత్ తన పోలీసు బృందంతో చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఈ విషయంపై డిపో మేనేజర్ సునీతను వివరణ కోరగా... ఇప్పుడేమీ చెప్పలేమనీ... వారికి నోటీసు ఇచ్చిన విషయం వాస్తవమేనని ఆమె తెలిపారు.
మరో వైపున నోటీసు జారీ చేయకుండా డబ్బాలను తొలగించారని షాపు యజమానులు నాగరాజు, కిషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరం ఎనిమిది వేలు డీడీలు చెల్లించామని, మాకు ఎలాంటి నోటీసు జారీ చేయకుండా వారి ఇష్టానుసారంగా డబ్బాలను తొలగించడంతో సుమారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్టం వాటిలిందని బాధితులు వాపోయారు.