Muthyalamma Temple Issue : ముత్యాలమ్మ గుడి ఘటన.. నిందితుడికి రిమాండ్

by M.Rajitha |
Muthyalamma Temple Issue : ముత్యాలమ్మ గుడి ఘటన.. నిందితుడికి రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన(Muthyalamma Temple Issue)లో నిందితుడికి కోర్ట్ రిమాండ్ విధించింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. వ్యక్తిత్వ వికాస తరగతుల కోసం మహారాష్ట్రలోని ఠాణె నుండి నిందితుడు హైదరాబాద్ కు వచ్చాడు. సికింద్రాబాద్ లోని మెట్రోపొలిస్(Metropolis) హోటల్ బస చేసి.. తెల్లవారుజామున సమీపంలోని కుమ్మరివాడలో గల ముత్యాలమ్మ ఆలయంలో ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకొని కొట్టి, పోలీసులకు అప్పగించారు. కాగా తీవ్ర గాయలైన నిందితుడికి ఆసుపత్రిలో చికిత్స అందించి శుక్రవారం అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు. నేడు కోర్టులో హాజరుపరచగా.. నిందితుడికి రిమాండ్ విధించింది.

Advertisement

Next Story

Most Viewed