- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ
ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ
దిశ, కల్వకుర్తి : కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకుండా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటే చర్య తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటూ వంగూర్ మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన చీమర్ల అర్జున్ రెడ్డి ని 2018 జూలై 25 నాడు పార్టీ నుంచి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఒబెదుల్ల కోత్వాల్ మెంబెర్ షిప్ ను రద్దు చేసి, సస్పెండ్ చేశారన్నారు.
ఈ మధ్య కాలంలో చీమర్ల అర్జున్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినని, జరగబోయే ఎన్నికల్లో నేనే ముందుండి వ్యవహరిస్తాననే రీతిలో ప్రజలకు మాయమాటలు చెప్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చీమర్ల అర్జున్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు తెలుసుకోవాలన్నారు. శనివారం నుంచి చీమర్ల అర్జున్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి సమావేశాలు, ప్రజలతో పార్టీ సంబంధాలు ఏర్పరచుకున్నా అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశ కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, వెల్దండ మండల అధ్యక్షులు మోత్య నాయక్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు బాల్ రాజ్, జంగయ్య,చంద్రకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.