కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ వెకిలి చేష్టలు.. విద్యార్థిని ఏం చేసిందంటే..

by Y.Nagarani |
కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ వెకిలి చేష్టలు.. విద్యార్థిని ఏం చేసిందంటే..
X

దిశ, నాగర్ కర్నూల్: ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా మాట్లాడిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థిని కుటుంబీకులు షీ టీం ను సంప్రదించారు. షీ టీమ్ అధికారి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కి చేరుకొని సమాచారం సేకరించారు. విద్యార్థినితో రాతపూర్వకంగా కంప్లైంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా షీ టీం అధికారి మీడియాతో మాట్లాడుతూ.. "నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా మాట్లాడినట్లు మా దృష్టికి వచ్చింది. విద్యార్థితో కంప్లైంట్ తీసుకున్నాం. పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. కాగా విద్యార్థి కుటుంబ సభ్యులు రికార్డ్ అసిస్టెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ కళాశాలకు ఇటీవలే పోస్టింగ్ లో వచ్చారు. మరో ఇద్దరు ముగ్గురు విద్యార్థినులను కూడా రికార్డ్ అసిస్టెంట్ వేధించినట్లు బాధిత విద్యార్థిని చెబుతోంది.

Next Story

Most Viewed