అలంపూర్ ఎంపీడీవోపై చర్యలకు రంగం సిద్ధం..?

by Shiva |
అలంపూర్ ఎంపీడీవోపై చర్యలకు రంగం సిద్ధం..?
X

మానవపాడు ఎంపీడీవోకు ఇన్ చార్జి బాధ్యతలు

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎంపీడీవో నాగ శేషాద్రి సూరిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. మండలంలోని మహిళ పంచాయతీ కార్యదర్శులను అసభ్య పదజాలాలను ఉపయోగిస్తూ పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారని, మిగతా వారిని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శుల సంఘం నేతలు గత పది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు విషయంపై సమగ్ర విచారణ జరిపేందుకు కలెక్టర్ జిల్లా స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించారు. మంగళవారం ఎంపీడీవో పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదికను రూపొందించి బుధవారం జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు సమాచారం. కాగా, అలంపూర్ ఎంపీడీవో బుధవారం నుంచి మూడు రోజుల పాటు సెలవులపై వెళ్లడం.. ఇన్ చార్జి బాధ్యతలను మానవపాడు ఎంపీడీవో రమణరావుకు అప్పగించడంతో ఎంపీడీవోపై చర్యలు తప్పకుండా ఉంటాయనే వాదనలపై మరింత బలం చేకూరింది.

Advertisement

Next Story

Most Viewed