- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షానికి తడిసి ముద్దైన మొక్కజొన్న
దిశ, అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తమ మొక్కజొన్న అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అకాల వర్షంతో మొక్కజొన్న తడిసి ముద్దయింది. గురువారం వివిధ ప్రాంతాల నుంచి 22 మంది రైతులు మార్కెట్ కు మొక్కజొన్నలు తీసుకురాగా..మొక్కజొన్నకు మార్కెట్ గరిష్ట ధర 2439 ఉండగా కనిష్ట ధర 1969 నిర్ణయించారు. గురువారం గత రెండు రోజుల కంటే అధికంగా వేడి ఉక్క పోత తో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. రైతులు మార్కెట్లో ఆరబెట్టిన మొక్కజొన్న పై తార్ఫాలింగ్ కవర్లు వేసినప్పటికీ భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షానికి కొట్టుకుపోతున్న మొక్కజొన్న ధ్యానాన్ని రైతులు ఎత్తుకుంటున్న తీరు రైతుకు కన్నీరు పెట్టించింది. రైతుకు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల సందర్భంగా కావున ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.