ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

by Naveena |
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
X

దిశ,గద్వాల కలెక్టరేట్ : ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశం హాలులో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి, తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మొత్తం (65) ఫిర్యాదులు అందాయని, వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మి నారాయణ, వివిధ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed