రికార్డుల నిర్వహణలో సరైన విధానాలు పాటించాలి

by Naveena |
రికార్డుల నిర్వహణలో సరైన విధానాలు పాటించాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రికార్డుల నిర్వహణలో సరైన విధానాలు పాటిస్తూ,వాటిని ఎప్పటికప్పుడు నవీకరించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఇన్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) సత్యనారాయణ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జోగులాంబ జోన్-7 డీఐజీ కార్యాలయాన్ని ఆయన అకస్మికంగా తనిఖీలు చేసి మాట్లాడారు. 2024 సంవత్సరంలో మొత్తం 5 జిల్లాల పోలీసుల పనితీరును విశ్లేషించగా..16,833 కేసులు నమోదు అయ్యాయని,వీటిలో 3,784 కేసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 5896 కేసులు నమోదు కాగా..నాగర్ కర్నూలు జిల్లాలో 3770 కేసులు,వనపర్తి జిల్లాలో 3538 కేసులు,గద్వాల జిల్లాలో 2419 కేసులు,నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 2210 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. హత్యలు 84, హత్యా యత్నాలు 78, దొంగతనాలు 1608, ప్రాపర్టీ లాస్ 11,10,83,316 రూపాయలు కాగా..3,42,37,750 రూపాయలు రికవరీ చేయబడిందని,రికవరీ పర్సంటేజ్ 30.82 శాతంగా ఉందని అన్నారు. కిడ్నాప్ లు 202, రేప్ లు 315, చీటింగ్ 779, రోడ్ ఆక్సిడెంట్స్ 1559 నమోదు అయ్యినట్లు తెలిపారు. ఉద్యోగులు తమ విధుల పట్ల నిబద్ధత చూపిస్తూ,ముఖ్యమైన రికార్డులను డిజిటలైజేషన్ చేసి భద్రంగా ఉంచడం అవసరమని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్,మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed