- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP leaders : పెంట్లవెల్లి కస్తూర్బా ఎస్ఓను సస్పెండ్ చేయాలి..
దిశ, పెంట్లవెల్లి : విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పెంట్లవెల్లి కస్తూర్బా ఎస్ఓను సస్పెండ్ చేయాలి అని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర అన్నారు. సోమవారం వారు హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా భరత్ చంద్ర మాట్లాడుతూ మూడు రోజులుగా విద్యార్థులకు అన్నంలో పురుగులు, కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని వారు ఆరోపించారు. హోస్టలోని విద్యార్థులతో వెట్టిచాకిరి చేపిస్తున్నారని హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న వర్కర్లు, టీచర్లు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నారని విద్యార్థుల ఆరోపించారు.
ఆదివారం రాత్రి వరకు 22 విద్యార్థులకు అస్వస్థత కాగా ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు తక్షణమే మంత్రి కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. కలెక్టర్ కొల్లాపూర్ పర్యటనకు వచ్చి రెండు గంటలు అవుతున్న ఇంకా విద్యార్థులను సందర్శించకపోవడం సిగ్గుచేటుగా ఉందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ ప్రసాద్, జిల్లా నాయకులు ఖలీల్ భాషా, మండల ప్రధాన కార్యదర్శి మూల వెంకటేష్ బీజేపీ మహిళ నాయకురాలు పాల్గొన్నారు.