- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పురివిప్పిన నెమలి' అందం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంతే
దిశ, జడ్చర్ల: ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతారు. మరి అలాంటిది ఓ నెమలి ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? నిజం చెప్పాలంటే వర్ణించడం కష్టం. ఎందుకంటే నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా.. అని అనిపించక మానదు. ఇక విషయానికి వస్తే.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేటలో మంగళవారం ఉదయం ఇలాంటి దృశ్యం కనిపించింది. గ్రామ శివారులోని పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో అందమైన నెమలి పురి విప్పి నాట్యం చేసింది.
నెమలి నాట్యం అందరినీ కనువిందు చేసింది. నెమలి పురివిప్పి ఆడుతూ అక్కడ ఉన్న రైతులను ఆకట్టుకుంది. ఉదయం వేళ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ అద్భుత సమయంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ నెమలి పురి విప్పి నాట్యం చేసింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ ప్రాంతంలో అడవుల్లో ఉన్న మయూరాలు లేలేత సూర్య కిరణాల సమయంలో నాట్యం చేస్తూ ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు.