డాక్టర్ కోసం పడిగాపులు కాస్తున్న రోగులు

by Mahesh |   ( Updated:2023-05-30 06:03:48.0  )
డాక్టర్ కోసం పడిగాపులు కాస్తున్న రోగులు
X

దిశ, రేవల్లి: రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో డాక్టర్ కోసం రోగులు పడిగాపులు కాస్తున్న సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రోగుల తెలిపిన వివరాల ప్రకారం.. పేరుకు పెద్ద దవాఖాన కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. తాగడానికి మంచినీరు మధ్యాహ్నం భోజనం సరిగా ఉండదు. ఏమన్నా అడిగితే ఇలాగే ఉంటది అని సిబ్బంది చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు వచ్చి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన దర్శనం మాకు దక్కడం లేదు. ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు మా ఆరోగ్యం చూపించుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాం.

కానీ ఇంతవరకు ఆయన రావడం లేదు. ఎన్నో బాధలతో ఇబ్బందులతో దూరం నుండి ఆసుపత్రికి వచ్చాం. కానీ ఇక్కడ మాకు ఎలాంటి వైద్యం అందించడం లేదు. నర్సులను అడిగితే డాక్టర్ రాలేదు వెయిట్ చేయమని చెబుతున్నారు. చేసేది ఏమీ లేక డాక్టర్ అనే దేవుడు కోసం పడిగాపులు కాస్తున్నామని వారు చెబుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ విధులకు లేటుగా వస్తే మా పరిస్థితి ఏంటి అని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు సకాలంలో డాక్టర్ అందుబాటులో ఉంచి మాకు వైద్యం చేయించవలసిందిగా పై అధికారులను కోరడమైనది.

Advertisement

Next Story