Collector Badavath Santosh : భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

by Aamani |
Collector Badavath Santosh : భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, నాగర్ కర్నూల్ : రానున్న ఐదు రోజులు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్రం లో భారీ వర్షాలు, ఎల్ ఆర్ ఎస్,ధరణి లో మార్పులు నూతన డ్రాఫ్ట్ ధరణి చట్టం పై ప్రజాభిప్రాయ సేకరణపై జిల్లా కలెక్టర్లతో, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీ.ఎస్. శాంతి కుమారి, వీడియో కాన్ఫరెన్స్ సమావేశ నిర్వహించారు. నాగర్ కర్నూల్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్లు కే సీతారామారావు, దేవ సహాయం, ఆయా శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటివి వాటిల్లకుండా చూడాలని సాధారణ జన జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.. వర్షపు జలాలు రహదారుల పై నుండి ప్రవహించే సమయాల్లో లెవెల్ వంతెనలు, కాజ్ వేలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల మీదుగా రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, కరెంటు స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణ పనులను తక్షణమే జరిపించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థాయిలోనే ఉందని అన్నారు.

అయినప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రానున్న ఐదు రోజులలో భారీ వర్షాలు కురిస్తే, వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని అధికారులకు సూచించారు మున్సిపాలిటీలు పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు సమన్వయంతో పని చేసి వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు.ధరణి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, మ్యుటేషన్ వంటివి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొత్త రెవెన్యూ, యాక్ట్ జిల్లాలోని మేధావులు రెవెన్యూ పరమైన ప్రముఖులతో ఈనెల 23వ తేదీన సమావేశం నిర్వహించాలని అదనపు కలెక్టర్ కు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed