- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mid day meals : విద్యార్థుల ధర్నాతో స్పందించిన అధికారులు..
దిశ, కొల్లాపూర్ : పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు దాటిన తమ స్కూల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగవట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డు పై మంగళవారం ఆందోళనకు దిగడంతో జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం సింగవట్నం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంటకాలను మహిళా సంఘాల సభ్యురాలు చేపట్టి వడ్డించారు. విద్యార్థుల ధర్నాతో అధికారుల నిర్లక్ష్య వైఖరిని తూలనాడుతూ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంతో ఎట్టకేలకు విద్యార్థుల పంతం నెగ్గింది. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగపట్నం హైస్కూల్లో పాఠశాలలో పునర్ ప్రారంభం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక అర్ధాకలితో ఉన్నారు. ఆ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం టిఫిన్ చేసి నడుచుకుంటూ వస్తుంటారు.
అయితే మధ్యాహ్న భోజనం వంటకాల ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి సకాలంలో రావాల్సిన బిల్లులు అందకపోవడంతో వంటలు చేయటానికి మహిళా సంఘాల సభ్యులు ముందుకు రాలేదు. దీంతో సింగవట్నం గ్రామంలోని మహిళా సంఘాల సభ్యురాలు ముందుకు రాలేదు. ఇంతకాలం మధ్యాహ్న భోజనం అందక అర్థాకలితో పస్తులున్న విద్యార్థులలో సహనం కోల్పోయారు. బహుజన విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకుడు దాస్, నియోజకవర్గ బీసీ విద్యార్థి సంఘం నాయకుడు భరత్ కుమార్ సదరు పాఠశాలను మంగళవారం సందర్శించి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో విద్యార్థులందరినీ ఏకం చేసి పాఠశాల ముందు కొల్లాపూర్ వనపర్తి ప్రధాన రహదారి పై విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా డీఆర్డీఏ ఏపీడి చిన్న ఓబులేసు, కొల్లాపూర్ మండల వెలుగు ఏపీఎం తిరుపతయ్య యాదవ్, సీసీ బ్రహ్మచారి మంగళవారం సాయంత్రం గ్రామంలో మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు శ్రావణి ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళా పొదుపు సంఘాల మహిళలతో చర్చించి మధ్యాహ్నం భోజనం వంటకాలను చేసేందుకు రాజీ కుదుర్చారు. గ్రామంలోని లీలా మహిళా సంఘం, తులసి మహిళా సంఘం నుంచి ఒక్కొక్కరి చొప్పున మధ్యాహ్న భోజనం వడ్డించేందుకోసం ముందుకు వచ్చారు. దీంతో బుధవారం సింగవట్నం హైస్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.