- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిత ది ముమ్మాటికీ హత్యే.. అమ్రాబాద్ పీఎస్ ఎదుట అఖిలపక్షాల ధర్నా..
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని నిఖిత ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యనేనని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ ఘటన విషయంలో గురుకుల యాజమాన్యం, పోలీసులు వ్యవహరించే తీరును నిరసిస్తూ, అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివారం అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట అఖిలపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, టీడీపీ నాయకుడు డాక్టర్ మోపతయ్యలు మాట్లాడుతూ.. సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు గురుకుల పాఠశాల యాజమాన్యం, పోలీసు అధికారులు మరణానికి గల కారణాన్ని తెలుపలేకపోయారని అన్నారు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, లింగాల ఎంపీపీ లింగమ్మ, టీడీపీ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి కొయ్యల శ్రీనివాసులు, బీసీ సంఘం నాయకులు కాశన్న యాదవ్, అంబేద్కర్ సంఘం నాయకులు ఎల్లస్వామి, మాల మహానాడు నాయకులు మల్లికార్జున్, ఎమ్మార్పీఎస్ నాయకులు కాసీం, హరి నారాయణ గౌడ్, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.