- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంద శాతం సామాజిక భద్రతలో కొనగట్టుపల్లికి జాతీయ అవార్డు..
దిశ, మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా హన్వాడ మండల కేంద్రానికి 8 కి.మీ దూరంలో చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో 421 కడపలు, 1665 మంది జనాభాతో నెలకొన గ్రామం 'కొనగట్టుపల్లి'. తెలంగాణ రాకముందు గ్రామంలో నిరక్షరాస్యత, పేదరికం, పిలల్లో పౌష్టికాహార లోపం, బాలికల్లో రక్తహీనత, నిరుద్యోగం, యువతకు ఉపాధి లేకపోవడం లాంటి ఎన్నో సామాజిక రుగ్మతలను ఎదుర్కొన్నది ఆ గ్రామం. సమస్యలతో సతమతమవుతున్న గ్రామాన్ని సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో నడుం బిగించింది గ్రామ సర్పంచ్ మానస. ముందుగా వార్డు కమీటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, ప్రజల భాగస్వామ్యంతో పక్కా ప్రణాళికతో గ్రామ సభలను నిర్వహిస్తూ, ప్రజల్లో సామాజిక అంశాలపై అవగాహనా కల్పించింది. గ్రామ అభివృద్ధికి వివిధ కమీటీలను ఏర్పాటు చేసింది.
ప్రతి నెలా పౌరహక్కుల దినం నిర్వాహణ, పిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, యుక్త వయసు బాలికలకు పౌష్టికాహరం పంపిణీ, ప్రాథమిక విద్య, ఉపాధి కల్పన వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పెద్ద యుద్ధమే చేసి సమ్మళిత అభివృద్ధిని సాధించి వంద శాతం సామాజిక భద్రతను సాధించింది సర్పంచ్ మానస. గ్రామంలో మార్పు, సాధించిన ఘనత జిల్లానే కాకుండా రాష్ట్రం గుర్తించింది. హైదరాబాద్ లో 2023 మార్చి 31 న ఐటి శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ల చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులలో, తెలంగాణ రాష్ట్రం 8 అవార్డులు సొంతం చేసుకున్నది. అందులో వంద శాతం సామాజిక భద్రతను సాధించిన గ్రామాలలో మొదటి స్థానం కొనగట్టుపల్లి గ్రామం సొంతం చేసుకున్నది.
గర్వ కారణంగా ఉంది...మంత్రి శ్రీనివాస్ గౌడ్..
హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామ పంచాయతీ, జాతీయ స్థాయిలో వంద శాతం సామాజిక భద్రత సాధించిన గ్రామ పంచాయతీ గా మొదటి స్థానంలో నిలిచి అవార్డు సాధించడం పట్ల మంత్రిగా నాకు ఎంతో గర్వ కారణంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందుకు గాను గ్రామ సర్పంచ్ మానస,పంచాయతీ కార్యదర్శి మొదలు వార్డు సభ్యులు,మండల స్థాయి ప్రజాప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజలకు,జిల్లా స్థాయి అధికారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.కొనగట్టుపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని,జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాతీలు గా నిలపడానికి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
కొనగట్టుపల్లికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది : జిల్లా కలెక్టర్ రవి నాయక్
జిల్లాలోని కొనగట్టుపల్లి కి జాతీయ స్థాయిలో సామాజిక భద్రతపై అవార్డు రావడం, ఈ జిల్లా కలెక్టర్ గా ఉండడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ రవి నాయక్ అన్నారు. గతంలో కూడా జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం,వరుసగా ఈ సంవత్సరం కూడా జాతీయ అవార్డు రావడం, ఇందుకు కృషి చేసినవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సాహంతోనే..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సాహం, సహకారంతోనే మండలంలోని కొనగట్టుపల్లి గ్రామ పంచాయతీ కి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని హన్వాడ ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసి విజయనిర్మల, కొనగట్టుపల్లి సర్పంచ్ మానస, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, హన్వాడ ఎంపీడివో ధనుంజయ గౌడ్ లు తెలిపారు. ఈ సంధర్భంగా వారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు.