- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గంలో ముదిరాజులే టాప్... వారి మద్దతు ఉన్నవారే ఎమ్మెల్యే
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట నియోజకవర్గం లో అత్యధికంగా ముదిరాజుల ఓట్లు ఉన్నాయి. 50 వేల పై చిలుకు ముదిరాజ్ ఓటర్లు ఉన్నారు. ముదిరాజుల మద్దతు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారే ఈజీ గా ఎమ్మెల్యేగా గెలుపొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ముదిరాజుల ప్రధానమైన డిమాండ్ ముదిరాజులను బీసీఏలోకి చేర్చాలని అలాగే ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే బలమైన డిమాండ్ కూడా ఉంది. ఈ మధ్యనే నారాయణపేట జిల్లా కేంద్రంలో ముదిరాజులు పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ పేరుతో ర్యాలీ నిర్వహించి తమ సత్తాను చాటారు. ఈ ర్యాలీలో ముదిరాజుల ముద్దుబిడ్డగా చెప్పుకునే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సైతం పాల్గొన్నారు.
ఎర్ర శేఖర్ నారాయణపేట ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్ రెడ్డి వెంట ఉండి ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్, కోయిలకొండ, దామరగిద్ద మండలాలకు చెందిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చితంగా ముదిరాజులను బీసీఏలోకి చేర్చి వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్ రెడ్డి అలాగే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బలమైన హామీ ఇచ్చారు. నారాయణపేట నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కలిగిన ముదిరాజుల తరఫున తాను నాయకుడిగా ఉండి ముదిరాజుల డిమాండ్ ను పరిష్కరిస్తానని ఎర్ర శేఖర్ తెలిపారు.