మల్దకల్‌ ఎస్ఐ గా నందీకర్ బాధ్యతలు స్వీకరణ

by Kalyani |
మల్దకల్‌ ఎస్ఐ గా నందీకర్ బాధ్యతలు స్వీకరణ
X

దిశ,‌గద్వాల: మల్దకల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా నందీకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నూతన‌ ఎస్ఐ కి‌ పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ పని చేస్తున్న సురేష్ గౌడ్ వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు.

Advertisement

Next Story