Chiranjeevi: ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్ణం నాకు కలిగింది: చిరంజీవి

by Hamsa |   ( Updated:2024-09-20 13:39:01.0  )
Chiranjeevi: ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్ణం నాకు కలిగింది: చిరంజీవి
X

దిశ, సినిమా: నేడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అద్భుతమైన నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. ఆయన ఒక నటనా మేధావి.

అద్భుతమైన పాత్రలతో ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. మెకానిక్ అల్లుడు కోసం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అందుకే నేను ఎంతో ఆనందించాను. ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా’’ అని రాసుకొచ్చాడు.

Read More : బ్రేకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు

Advertisement

Next Story