Akkineni: ఘనంగా అక్కినేని శతజయంతి ఉత్సవాలు.. స్మారక పోస్టల్ స్టాంపు విడుదల

by Ramesh Goud |
Akkineni: ఘనంగా అక్కినేని శతజయంతి ఉత్సవాలు.. స్మారక పోస్టల్ స్టాంపు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత సినీ హీరో అక్కినేని నాగేశ్వర్రావుపై పోస్టల్ శాఖ స్టాంపు విడుదల చేసింది. ప్రముఖ సినీనటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్రావు 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబంతో పాటు హీరో మురళీ మోహన్ సహా పలువురు సినీ పెద్దలు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక స్టాంపును తపాల శాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ స్మారక స్టాంపును విడుదల చేస్తున్నట్లు తపాల శాఖ అధికారులు ప్రకటించారు.

ఈ వేడుకల్లో ఇండియా పోస్టల్ సర్వీసెస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా. పీవీఎస్ రెడ్డి పాల్గొని, అక్కినేని స్మారక స్టాంపును సినీ హీరో అక్కినేని నాగార్జునకు అందించారు. అలాగే ఈ వేడుకల్లో అక్కినేని జాతీయ అవార్డును కూడా ప్రకటించారు. అక్కినేని జాతీయ అవార్డును మెగా స్టార్ చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి చిరంజీవికి అవార్డు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హాజరవుతారని నాగార్జున వెల్లడించారు.

Next Story

Most Viewed