శోభాయమానంగా.. ముని రంగ స్వామి తేరు ఉత్సవాలు

by Mahesh |   ( Updated:2023-02-12 02:51:53.0  )
శోభాయమానంగా.. ముని రంగ స్వామి తేరు ఉత్సవాలు
X

దిశ, భూత్పూర్: భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల ఆధ్వర్యంలో భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ముని రంగస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి మొదలుకొని ఆదివారం తెల్లవారుజామున వరకు తేరు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విద్యుత్ కాంతులు.. రకరకాల పూలతో అలంకరించిన తేరు మున్సిపాలిటీ మండల కేంద్రంలోని పలు ప్రధాన దారుల గుండా సాగింది..

భక్తుల భజనలు.. గోవింద నామస్మరణలతో సాగిన ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో చైర్మన్ బసవరాజు గౌడ్, ముడా డైరెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నారాయణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నర్సింలు, యాదయ్య, రాములు, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed