డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ

by Naveena |
డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ
X

దిశ,చిన్న చింతకుంట : హర్యానా గెలుపును బీజేపి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.చిన్నచింతకుంట మండల కేంద్రంలో బుధవారం వెంకటేశ్వర రెడ్డి మైదానంలో ఏర్పాటు చేసిన పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సభ్యత్వ నమోదు ప్రక్రియను కార్యకర్తలు స్పీడ్ అప్ గా చేయాలన్నారు. కేంద్రం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి పార్టీ సభ్యత్వం పెంచేలా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు.రాజకీయంగా ఎదగాలనుకునే వారు .సభ్యత్వ పెంచడంపై దృష్టికి పెట్టాలన్నారు. తన గెలుపు ప్రధాని మోడీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బీజేపిని బలపర్చాలన్నారు. పార్టీలో ఉంటూ వెన్ను పోటు రాజకీయాలను పాల్పడే వాళ్లని పార్టీ ఉపేక్షించాదు,నిబంధనలకు లోబడి పార్టీ కోసం పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. బీజేపి పార్టీ బలోపితం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీకి పార్టీ నాయకులకు అందరికీ సహకారం ఉండాలని చెప్పారు. తెలంగాణలో జెండా ఎగరాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఇంచార్జ్ ప్రశాంత్ రెడ్డి, సభ్యత నమోదు మండల ఇంచార్జ్ నారాయణరెడ్డి, జిల్లా నాయకులు మహేష్ యాదవ్, నరసింహ యాదవ్, వెంకటన్న,జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాము,మండల అధ్యక్షుడు దశరథ్,గుబ్బ శ్రీను, మండల నాయకులు మనోహర్, నరేందర్ జి, నరేష్,రుతు కుమార్ గౌడ్, బాలచందర్ శెట్టి, బాలస్వామి, నరసింహ, రవి, రాములు, భోగం రాజు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story