- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
దిశ, భూత్పూర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ మేరకు ఆమె మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వగ్రామం అన్నా సాగర్ కు చేరుకున్నారు. దివంగతుడు అయిన శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి కవిత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఉంటూ చలాకీగా ఉండే శశివర్ధన్ రెడ్డి మరణించారు అంటే నమ్మలేకపోతున్నామని కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కదిరే శేఖర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, వైస్ ఎంపీపీ నరేష్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు నారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.