కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

by Naveena |
కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
X

దిశ, దేవరకద్ర: దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి బుధవారం ఆయకట్టు రైతులకు యాసంగి పంటకు కుడి, ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ..కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు ఈ యాసంగిలో 5 విడతలుగా సాగునీటిని విడుదల చేస్తున్నామని, అందులో భాగంగా తొలివిడతగా నీటిని విడుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజల్ రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఆది హనుమంత్ రెడ్డి, కోన రాజశేఖర్, కొండ అంజన్ కుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , ఎండి ఫారుక్ ,భరత్ కుమార్, ప్రేమ్ యాదవ్, చందు గౌడ్,గోపాల్ ఇరిగేషన్ అధికారులు, మరియు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story