బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

by Hamsa |   ( Updated:2023-03-31 14:22:23.0  )
బడ్జెట్ సమావేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
X

దిశ, భూత్పూర్: నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ 2023- 24 సంవత్సర బడ్జెట్ సమావేశం ప్రిన్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ మున్సిపాలిటీ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక అవార్డులు లభించాయని అందులో మన నియోజకవర్గానికి చెందిన భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీలు ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు.

గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి చెందించడం ద్వారానే ఈ అవార్డులు దక్కాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రుల సహకారంతో పాలకమండలి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారంతో మునిసిపాలిటీని మరింత సుందరంగా రూపొందిస్తామని చెప్పారు. 2023- 24 సంవత్సరానికి గాను ఆదాయ, వెయ్యాల అంచనాను 21 కోట్ల యొక్క లక్షల రూపాయలుగా నిర్ణయించారు.

రెండు కోట్ల 40 లక్షల రూపాయలు పన్ను రూపేన రాగా, 6 కోట్ల 69 లక్షల 95 వేల రూపాయలు పన్ను ఏతర రూపాలలో మునిసిపాలిటీకి ఆదాయం వచ్చినట్లుగా చైర్మన్ బస్వరాజ్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, ఆర్డిఓ అనిల్ కుమార్, తాసిల్దార్ చెన్న కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ నూర్ ఉల్ నజీబ్, మేనేజర్ అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగమ్మ, రామకృష్ణ, కృష్ణవేణి, బాలకోటి, కో ఆప్షన్ సభ్యులు అజ్జు, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed