MLA Megha Reddy : చౌడేశ్వరీదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి..

by Sumithra |
MLA Megha Reddy : చౌడేశ్వరీదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి..
X

దిశ, పెబ్బేరు : పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకుని తొగట వీరక్షత్రియా సంఘం ఆధ్వర్యంలో ఆలయ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అభిషేకము, అలంకరణ ప్రత్యేక పూజలు, కుంకుమార్చన బోనం అలంకరణతో పూజలు నిర్వహించారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా బాజాభజంత్రీలతో భజనలు చేస్తూ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడు, భాను ప్రకాష్ రెడ్డి, సత్యం, తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు రంగం నరసింహ, పెనుగొండ శ్రీను, పూరు వెంకటరమణ, గోపాల్, పూజారి ఆంజనేయులు, సత్యం, సంఘం సభ్యులు, అమ్మవారి భక్తులు, భజన బృందాల సభ్యులకు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed