ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

by Nagam Mallesh |
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
X

దిశ,వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఇందుకు తగ్గట్టే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలను పంట కాలువలు, రెగ్యులేటర్ల ను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ 15 రోజుల వరకు రైతులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, సమస్యలు తలెత్తుతే తక్షణమే పరిష్కారం చేసేలా చర్యలు తీసుకువాలని సూచించారు. నిధుల గురించి ఆలోచించకుండా పనులు చేయాలని.. నిధుల గురించి తను చూసుకుంటానని ఎమ్మెల్యే అధికారులకు భరోసా కల్పించారు. మున్సిపల్ చైర్మెన్ పుట్టపాక మహేష్,మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, పట్టణ, నియోజకవర్గం, మండల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story