వేరుశనగ దిగుబడి అమోఘం: గువ్వల బాలరాజు

by S Gopi |   ( Updated:2023-03-09 14:09:08.0  )
వేరుశనగ దిగుబడి అమోఘం: గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట: జిల్లాలోని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు కావలసిన సదుపాయాలను, గిట్టుబాటు ధరను తెలుసుకుని గిట్టుబాటు ధర కల్పించి సరైన సదుపాయాలు కల్పించేలా చూడాలని మార్కెటింగ్ శాఖ వారికి సిబ్బందిని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం, సాగునీరు అందించడం ద్వారా రైతులు రికార్డు స్థాయిలో పంటలను పండిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెం.1గా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ చైర్మన్ అరుణ, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ పలక మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story