లో లేవల్ 13 ప్యాకేజి కాల్వను పరిశీలించిన ఎమ్మెల్యే..

by Sumithra |
లో లేవల్ 13 ప్యాకేజి కాల్వను పరిశీలించిన ఎమ్మెల్యే..
X

దిశ, మక్తల్ : నియోజకవర్గంలోని సంగం బండలో లెవెల్ కెనాల్ ద్వారా పొలాలకు నీటి సరఫరా ఏలా జరుగుతుందో పరిశీలించేందుకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా విచ్చేశారు. చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ లో లెవల్ 13వ ప్యాకేజీ కింద నేరెడగోమ్ము, వర్కురు కాల్వ చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు రెండు వేల ఎకరాల్లో యాసంగి వరి పంటను రైతులు సాగు చేసుకున్నారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో సంగంబండ రిజర్వాయర్లు నీటిమట్టం తగ్గిపోవడంతో కెనాల్ కాల్వలకు నీరు అందక పోవడంతో రైతులు ఆందోళన చెందారు. వరిపంట గింజ గట్టి పడే సమయాన వరిపంటకు నీరు అందించకుంటే వరికరా తాలుగా మారే అవకాశం ఉంటుంది.

ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా రైతుల పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే లో లెవెల్ కాల్వను మరమ్మతులు చేసి ప్రత్యేకంగా 16 ఆస్పవర్ తో కూడిన రెండు మోటార్లను రిజర్వాయర్ లో ఉంచి లో లెవెల్ కాల్వలకు నేరుగా పంపింగ్ చేయించారు. ఈ పనులు ఎలా జరుగుతున్న విషయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులను కలిసి మాట్లాడుతూ ఎప్పుడు తాను అండగా ఉంటానని వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా కలవాలనీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో నేరడగోమ్ము సర్పంచ్ అశోక్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, రామలింగం, ప్రాజెక్టు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story