కొల్లాపూర్ లో ఎమ్మెల్యే బీరం దంపతుల ప్రత్యేక పూజలు

by Sumithra |   ( Updated:2023-01-14 13:30:41.0  )
కొల్లాపూర్ లో ఎమ్మెల్యే బీరం దంపతుల ప్రత్యేక పూజలు
X

దిశ, కొల్లాపూర్ : మండలం కొల్లాపూర్ నియోజక పరిధిలోని శ్రీ గోదా రంగనాథ స్వామికళ్యాణ మహోత్సవానికి పట్టణంలోని రామాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం కొల్లాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మాధవస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయ కమిటీ సభ్యులు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో కొల్లాపూర్ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో అలాగే ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి చెంది పాడిపంటలు సమృద్ధిగా పండి రైతుల కష్టాలు తొలగిపోవాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. గోదా రంగనాథ స్వామి ఆశీర్వాదంతో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లాపూర్ పట్టణ వాసులకు భక్తజనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ పురప్రముఖులు, పట్టణవాసులు, భక్తులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed