- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మేబాటలో మిషన్ భగీరథ కార్మికులు.. 56 గ్రాములకు నిలిచిన తాగునీరు
దిశ, మక్తల్: గడిచిన ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని మిషన్ భగీరథ (సత్య సాయిబాబా)కార్మికులు సోమవారం మధ్యరాత్రి నుంచి సమ్మె దిగారు. దీంతో మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మాగనూరు, మక్తల్ మండలాల్లోని 56 గ్రాములకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో నీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఎప్పుడు కోల్కికి వస్తుందోనని ప్రజలు అంటున్నారు. సత్య సాయి బాబా స్కీంలో పనిచేస్తున్నప్పుడు కార్మికులు 16 వేల రూపాయలు జీతం వచ్చేదని. మిషన్ భగీరథ లో విలీనం చేయడం తో నేలకు రూ.10 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని, మిగతా డబ్బుల గురించి అడిగితే చూద్దాం చేద్దామని తప్పించుకుంటున్నారన్నారు.
గత ఐదు నెలలుగా ఆ జీతం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జీతం సరిగ్గా రాకపోవడంతో తమ కుటుంబ సభ్యులు పస్తులు ఉంటున్నామని, పిల్లలకు ఫీజు కట్టలేక బడి మాన్పించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు జీతాలు రాని విషయం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన మిషన్ భగీరథ అధికారులతో చర్చించి జీతాలు వచ్చేలా చేస్తానని హమి ఇచ్చారు. అయినప్పటికి సెప్టెంబర్ 10 తారీకు వచ్చినా జీతాలు రాకపోవడం తో మధ్యరాత్రి నుండి సమ్మెకు దిగామని ఆ సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. తమ వల్ల ఏర్పడిన నీటి అంతరాయాన్ని 56 గ్రామాల ప్రజలు అర్థం చేసు కోవాలని ఆయన అన్నారు.