ఆచూకీ తెలపండి.. సలేశ్వరం జాతరలో తప్పిపోయిన మహిళ

by samatah |
ఆచూకీ తెలపండి.. సలేశ్వరం జాతరలో తప్పిపోయిన మహిళ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం లింగమయ్య జాతరలో ఒక మహిళ అదృష్టమైనట్లు శనివారం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. సలేశ్వరం జాతరలో అదృష్టమైన మహిళ కర్ణాటక రాష్ట్రం రాయచూరు ప్రాంతానికి చెందిన గాయత్రి (25) ఈనెల 6న సలేశ్వారం జాతరకు రావటం జరిగిందినీ, తిరుగు ప్రయాణంలో ఆ మహిళ అడవిలో తప్పిపోయిందని, దయచేసి కనిపిస్తే సమాచారం ఈ క్రింది ఫోన్ నెంబర్ 9490151768 కు సమాచారం అందించాలని గాయత్రి మేనబావ నటరాజ్ దిశకు ఫోను ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయచూరు ప్రాంతం ఎల్.బి.ఎస్ నగర్ కాలనీలో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి గాయత్రి సలేశ్వరం జాతరకు వచ్చిందని, తిరిగి వెళుతున్న క్రమంలో తనతో పాటు ఉన్న అమ్మానాన్న చెల్లెమ్మ చాలాసేపు గాయత్రి వస్తుందని ఆశతో అడవిలో సలేశ్వరం మార్గంలో ఎదురు చూశారని ఎంతకీ రాకపోవడంతో అటవీశాఖ అధికారులకు, లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed