జ్యూవెలరీ షాపులో పట్టపగలే భారీ చోరీ..

by Kalyani |
జ్యూవెలరీ షాపులో పట్టపగలే భారీ చోరీ..
X

దిశ, మద్దూరు: ఓ జ్యూవెలరీ షాపులో పట్టపగలే భారీ చోరీ జరిగిన సంఘటన నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి చంపాలాల్ మండల కేంద్రంలోని జ్యూవెలరీ వ్యాపారస్తులకు ప్రతి వారం వెండి ఆభరణాలు సరఫరా చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే గురువారం స్థానిక మౌనేశ్వర జ్యూవెలరీ షాపు వద్దకు ఏడు కిలోల వెండి ఆభరణాలు గల బ్యాగుతో వచ్చి షాపు యాజమాని రవితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని యువకుడు బ్యాగు తీసుకుని అక్కడి నుంచి పరారవుతుతున్నాడు. ఇది గమనించిన వ్యాపారి, షాపు యాజమాని వెంబడించే క్రమంలోనే యువకుడు ద్విచక్రవాహనంపై ఆభరణాల బ్యాగుతో ఉడాయించాడు. చోరీ జరిగిన విషయం షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Next Story