మార్కెట్లలో దళారులదే రాజ్యం.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి!

by Shiva |
మార్కెట్లలో దళారులదే రాజ్యం.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి!
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులు ఇటు రైతులను.. అటు ప్రభుత్వాన్ని నిలువునా ముంచే కేంద్రాలుగా మారాయి. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అధికారులు అవేవీ పట్టించుకోకుండా దళారులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో వారు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే కాకుండా అన్నదాత నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ తంతంగమంతా అందరికీ తెలిసినా.. తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

రైతులను ముంచుతున్నారు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దాదాపుగా ప్రతి మార్కెట్‌లోనూ మోసాలు జరుగుతున్నాయి. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో దళారులు ఇష్టరాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి, వేరుశనగ, తదితర ధాన్యాలను పండించిన రైతులు తమకు గిట్టుబాటు ధర లభించి అప్పులు తీరుతాయని మార్కెట్లకు వచ్చి నిలువునా మోసపోతున్నారు. దళారులు మీరు పండించిన ధాన్యంలో తేమ, నాణ్యత లేదంటూ మాయమాటలు చెప్పి మోసం చేసి మార్కెట్‌లో అధికారులు కాంట వేయకుండానే దళారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తూకం సమయంలోనూ రైతులు మోసపోతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అడ్డుకట్ట వేసే దళారులు.. అటు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కొత్తగా మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం జరిగింది. ఈ విషయంలో ఆ కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు, సభ్యులంతా రైతులకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

మార్పు దిశగా పాలమూరు మార్కెట్ కమిటీ

కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకమండలి సభ్యులు మార్కెట్‌లో జరుగుతోన్న అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. దళారుల కారణంగా ఇటు రైతులు.. అటు ప్రభుత్వం పూర్తిగా మోసపోతున్నట్లుగా గుర్తించారు. మహబూబ్‌నగర్ మార్కెట్‌లో జరుగుతోన్న అవకతవకలపై విచారణ జరిపి వివరాలను ప్రభుత్వానికి చేరవేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ సన్నద్ధం అవుతున్నారు.

Next Story

Most Viewed