- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IELTS Exam: ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్ లేకుండా విదేశాల్లో చదవాలనుందా..? అయితే ఈ దేశాలకు వెళ్ళండి
దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల(Students who want to study in abroad)కు ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షల(English Language Proficiency Tests) ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. అయితే ఆంగ్లానికి సంబంధించిన పరీక్షలలో మంచి స్కోరు తెచ్చుకొని, అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకోవాలని ఆశ పడుతుంటారు.కానీ ఇది చాలా మంది విద్యార్థులకు సాధ్యపడదు.అయితే కొన్ని దేశాలు ఈ పరీక్ష అవసరం లేకుండానే వారి దేశాల్లో చదువుకునే వెసులుబాటు కలిపిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఎలాంటి స్కోరు అవసరం లేకుండా వారి యూనివర్సిటీల నిబంధనలు అనుసరించి మీరు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
మరి ఐఈఎల్టీఎస్(IELTS) అవసరం లేని దేశాలేంటో చూద్దామా..
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని టాప్ టైర్ కాలేజీల్లో సీటు పొందాలంటే ఐఈఎల్టీఎస్ అవసరమే లేదు. అయితే వాటి స్థానంలో ఆల్టర్ నేటివ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులను నిర్వహించి వారి యూనివర్సిటీలలోకి అనుమతిస్తారు.ఉదాహరణకు కేంబ్రిడ్జ్ ఇంగ్షీష్ ఎగ్జామ్, పీటీఈ అకడమిక్ ఎగ్జామ్స్.
కెనడా: ఉన్నతమైన విద్యాప్రమాణాలతో, నాణ్యమైన విద్యనందించటంలో కెనడా దేశం ఎప్పుడూ ముందుంటుంది. నిజానికి కెనడాలో చదవాలనే ఆలోచన చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. అయితే ఇక్కడ పీటీఈ అకడమిక్, టోఫెల్ ఇంకా ఇతర భాషా పరీక్షల స్కోరులను అనుమతిస్తారు. మీరు ఎన్నుకునే యూనివర్సిటీని బట్టి ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ఫ్రాన్స్: ఫ్రాన్స్ దేశం ఎప్పుడూ తమ సాంస్కృతిక వైవిధ్యాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.దీంతో పాటు మంచి పేరున్న విద్యావిధానాలు ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడి చాలా యూనివర్సిటీలు డీఏఎల్ఎఫ్(ఫ్రాన్స్ స్థానిక పరీక్ష) లేదా డీఈఎల్ఎఫ్ పరీక్షలతో ప్రవేశాలు కల్పిస్తాయి.
న్యూజిలాండ్: ఇక్కడ ఐఈఎల్టీఎస్(IELTS) స్కోరు లేని విద్యార్థుల నుంచి ఇతర ప్రొఫిషియెన్సీ టెస్టుల స్కోరును ఈ దేశం అనుమతిస్తుంది.
సింగపూర్: ఇక్కడ చదవాలనుకునే వారికి ఇంటర్నల్ లాంగ్వేజ్ అసెస్ మెంట్స్ నిర్వహించే వీలుంటుంది. ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్ స్కోరు అవసరం లేదు.
మలేషియా: తక్కువ ఖర్చుతో విద్యను పూర్తి చేయాలనుకునేవారికి మలేషియా మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.విదేశీ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఐఈఎల్టీఎస్ లేకుండా ఇతర పరీక్షలతో ప్రవేశాలు కల్పిస్తోంది ఈ దేశం.
జర్మనీ: ఇక్కడ కూడా తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనభ్యసించవచ్చు.ఇక్కడ టోఫెల్ లేదా తమ సొంత లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించి వారి యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తోంది.
ఈ దేశాలే కాకుండా చైనా, సౌత్ కొరియా, జపాన్ ఇంకా చాలా దేశాలు ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్ తో పనిలేకుండా వారి వర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.