- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi in US: క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు.. సదస్సులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదనీ ప్రధాని మోడీ అన్నారు. అమెరికాలోని డెలావేర్‌లో జరుగుతున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. క్వాడ్ కూటమి అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టముట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని చెప్పారు. స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత సంపన్న ఇండో-పసిఫిక్.. క్వాడ్ భాగస్వామ్య ప్రాధాన్యత అని అన్నారు. ఆరోగ్యం, వాతావరణ మార్పు, భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత రంగాల్లో క్వాడ్ ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
బైడెన్ ని ప్రశంసించిన మోడీ
కూటమికి బైడెన్ అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ ప్రెసిడెంట్ జో బైడెన్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మూడోసారి క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇంత తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని అన్ని దిశల్లో విస్తరించాయన్నారు. ఇందులో ముఖ్యపాత్ర పోషించారని బైడెన్ ని కొనియాడారు. క్వాడ్‌కు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపారు. 2025లో సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు.
డెలావర్ లో బైడెన్ తో భేటీ
అంతకుముందు ప్రధాని మోడీ.. డెలవెర్‌లోని బైడెన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక, అంతర్జాతీయ అంశాల గురించి చర్చించారు. చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ తర్వాత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘డెలవేర్‌లోని గ్రీన్‌విల్లేలో ఉన్న తన నివాసంలో నాకు ఆతిథ్యమిచ్చినందుకు అధ్యక్షుడు బైడెన్‌కు ధన్యవాదాలు. మా చర్చలు ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించడానికి మాకు అవకాశం లభించింది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ట్వీట్‌కు బైడెన్ స్పందించారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైందని చెప్పారు. మోడీతో భేటీ అయిన ప్రతిసారీ ఇరు దేశాలకు సంబంధించిన కొత్త అంశాలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
- Tags
- narendra modi