ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Nagam Mallesh |
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ,అచ్చంపేట రూరల్: అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కారం-బకలింగయ్య పల్లి గ్రామానికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు అక్కారం నుంచి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ నుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొడ్కా (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకో వ్యక్తి రవి(33) కి తీవ్ర గాయాలు ఇవ్వడంతో ఆయన్ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story