- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుంగభద్ర నదిలో భక్తుడి గల్లంతు
దిశ ,అలంపూర్ టౌన్ : అలంపూర్ జోగులాంబ దేవాలయ తుంగభద్ర పుష్కర ఘాట్‌లో బుధవారం సిద్దిరామ్(20) అనే భక్తుడు గల్లంతు అయ్యాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా అలంపూర్ మీదుగా శ్రీశైలం వెళ్తారు. ఇదే క్రమంలో బుధవారం ఉదయం మక్తల్ మండలం సంగంబండకు చెందిన సిద్దిరామ్ కొంతమంది యువకులు శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లారు.
అలంపూర్ సమీపంలో తుంగభద్ర నదిని ఈదుకుంటూ వెళ్లే ప్రయత్నంలో సిద్దిరామ్ గల్లంతు అయ్యాడు. మక్తల్ మండలం సంగం బెండ గ్రామానికి చెందిన సిద్ధిరాం గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక ప్రాంతంలో గొర్రెలను మేపడానికి వెళుతూ అక్కడి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా కాలినడకన శ్రీశైలం వెళ్లి రావడం జరుగుతోంది. ఈ క్రమంలోని కర్ణాటకకు చెందిన కొంతమంది భక్తులతో కలిసి శ్రీశైలం కి బయలుదేరి తుంగభద్ర నది దాటే క్రమములో సిద్ది రామ్ గల్లంత య్యాడు. ఈ మేరకు అలంపూర్ ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు, మత్స్యకారులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.