- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత.. వ్యక్తి మృతికి డాక్టర్లే కారణమా?
దిశమక్తల్: పొలం దగ్గర కింద పడిన మొగులప్ప (40)ను తీవ్ర అస్వస్థత గురికావడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రోజు మధ్యాహ్నం జరిగింది. పేషెంట్ కు డాక్టర్లు సత్వర చికిత్స చేసి ఉంటే చనిపోయేవాడు కాదని డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమని గుంర్లపల్లి గ్రామానికి చెందిన బంధువులు డాక్టర్ల నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మూకుమ్మడిగా డాక్టర్లు ఉన్న గదిలోకి వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం ఎర్పడింది.అక్కడే ఉన్న తిరుపతి రెడ్డి హోంగార్డు సమయాను కూలంగా స్పందించడం ఈవిషయాన్ని స్థానిక ఎస్సై కి "దిశ" చేరవేయడంతో మక్తల్ ఎస్ఐ పర్వతాలు తన సిబ్బందితో దగ్గరికి వచ్చి గొడవలు సద్దుమణిగెలా చేశారు.
గుర్లపల్లి గ్రామానికి మొగులప్ప వరి పొలానికి యూరియా వేద్దామని సిద్ద మౌవుతుండగా, పొలంలో మేకలు పడడంతో వాటిని తరమడానికి పరిగెత్తే సమయంలో కింద పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కై మక్తల్ సివిల్ ఆస్పత్రికి తీసుకరాగా డాక్టర్ ఓపి పేషెంట్లకు వైద్యం అందిస్తుండగా, వచ్చి చికిత్స చేసేలోపు వ్యక్తి మృతి చెందాడని డాక్టర్ బంధువులకు తెలపడంతో ఒకసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
దీంతో వైద్యసిబ్బంది గ్రామస్తులు మధ్యన వాగ్వివాదం జరగడం. మూకుమ్మడిగా జనం డాక్టరు ఉన్న గదిలోకి వెళ్లి నిలదీయడంతో సమయానుకూలంగా అక్కడ ఉన్నహోంగార్డు తిరుపతిరెడ్డి ఇరువురి మధ్యన ఉండి అడ్డుకోవడం ఆ సమయంలోనే మక్తల్ ఎస్సై పర్వతాలు తన సిబ్బందితో రావడం గొడవను సద్దుమణి గెలా చేశారు. మృతుడికి భార్య కొడుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.