రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

by Kalyani |
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, గద్వాల క్రైం: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలుకింద పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు నరసింహులు (48), గత కొద్ది రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్నాడు. కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు.

మంగళవారం రాత్రి 7.41 గంటల ప్రాంతంలో తన చిన్న కూతురు అంకితకు ఫోన్ చేసి తాను రైలు కిందపడి చనిపోతున్నట్లుగా చెప్పాడు. అనంతరం గద్వాల -రాయచూరు లైన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వివరించారు.

Advertisement

Next Story