సీఎం భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

by Kalyani |
సీఎం భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి
X

దిశ, గద్వాల టౌన్: ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్ సమీపంలో నిర్వహించబోయే సీఎం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గద్వాల నియోజక వర్గం ధరూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీన సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి విచ్చేస్తున్నారని చెప్పారు.

జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్ సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే భారీ బహిరంగ సభను 20 వేలకు పైగా ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ధరూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి బహిరంగ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు డీఆర్ విజయ్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story