- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
దిశ, కొత్తపల్లి: ఏప్రిల్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోకామాసందు బావాజీ ఉత్సవాలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఘనంగా నిర్వహించుకోవాలని, అందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కొడంగల్ ఎమ్మెల్లే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కొత్తపల్లి మండల తిమ్మారెడ్డి పల్లిలో బావాజీ జాతర ఏర్పాట్లపై గ్రామాన్ని సందర్శించారు.
ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయమై తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో కంట్రోల్ రూం, భక్తులకు ప్రత్యేక మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాం మనోహర్ రావు, ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులు మురళి, నరేందర్, బాబురావు, రాములు, వెంకటయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.