- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి మేళా సక్సెస్
దిశ, కోస్గి : కోస్గి పట్టణంలో పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ అయిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 50కి పైగా కంపెనీలతో నిర్వహించామన్నారు. 1800 మంది యువత పెద్ద సంఖ్యలో మెగా జాబ్ మేళాకు తరలిరాగా 50కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్.ఆర్‌లు వచ్చి యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించి 491 మందికి సెలెక్ట్ అయినవారికి తమ సంస్థల్లో పనిచేసేందుకు
నియామక పత్రాలను అందించామన్నారు. యువత ఖాళీగా ఉండకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులవుతుందని, ఈ అవకాశాలను అందిబుచ్చుకొని ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్.లింగయ్య, సీఐ లు దస్రు నాయక్, రామ్ లాల్, ఎస్ఐలు బాల వెంకటరమణ, కుర్మయ్య, రమేష్, నవీద్, సునిత, పోలీసు సిబ్బంది, వివిధ కంపెనీల హెచ్. ఆర్ లు నిరుద్యోగ నివారణ ఫండేషన్ హెచ్ ఆర్ చందర్, సీడీటీఏ రఘురామ రాజు, జీవన్, సిబ్బంది, యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Job fair