SP T. Srinivasa Rao : పేకాట స్థావరం పై దాడి ఆరోపణల పై విచారణ..

by Sumithra |
SP T. Srinivasa Rao : పేకాట స్థావరం పై దాడి ఆరోపణల పై విచారణ..
X

దిశ, గద్వాల : ఈ నెల 13న ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరం పై దాడికి సంబంధించి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు వివరణను బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పేకాట స్థావరం పై దాడి సందర్భంగా వచ్చిన ఆరోపణ దృష్ట్యా, మీడియా మిత్రులు కూడా వివరణ కోరుతున్న సందర్భంగా ఈ ఆరోపణ పై జిల్లా అదనపు ఎస్పీ కె. గుణ శేఖర్ ఆధ్వర్యంలో పూర్తి విచారణకు ఆదేశించారని, ఈ సంఘటనలో పోలీస్ అధికారుల పై గాని, సిబ్బంది పై గాని ఆరోపణ రుజువైతే వారి పై తప్పకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

అలాగే ఆరోపణలకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి నేరుగా లేదా ఫోన్ లో తమని సంప్రదించి ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి నిజమని తేలితే బాధ్యుల పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఆ బాధితుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

Advertisement

Next Story