- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వీడి కారెక్కుతున్నారు..!
దిశ, భూత్పూర్ : భూత్పూర్ మండలంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రోజు రోజుకు రాజకీయం ప్రచారాలతో మండలంలోని పలుగ్రామ ప్రాంతాలు హోరెత్తుతోంది. జోరు వానలో సైతం లెక్కచేయకుండా అధికారపక్షం దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం మండలంలోని పోతులమడుగు, గోప్లాపూర్ ,శేరిపల్లి(హెచ్), ఆస్నాపూర్ పోతులమడుగు, రావులపల్లిలో తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఇదే క్రమంలో ఇతర పార్టీల నుంచి రోజురోజుకు ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు గులాబీ కండువా వేసుకుని కారు ఎక్కుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో కీలక బాధ్యతలు ఉన్న వారు సైతం ఒక్కొక్కరుగా కారు ఎక్కారు.
ఇదే క్రమంలో మరికొంతమంది గురువారం మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రావు సమక్షంలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో ఇప్పలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ చెందిన మైనార్టీ నాయకులకు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో గులాబీ కండువాలు కప్పుకున్న వారిలో మహమ్మద్ రోసిన్ ,హుస్సేన్ యాకు రఫీ ముస్తఫా, నూతన ఓటర్లు బాలకృష్ణ ,నవీన్, శివకుమార్ ,వరప్రసాద్ ,వెంకటేష్ బీఆర్ఎస్ కు పార్టీకి మద్దతు తెలిపారు. వీరితోపాటు మండలంలోని కరివెన గ్రామపంచాయతీ ముష్టియన్ పల్లికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు జహంగీర్ ,ఖాజామియా, గోరేమియా ,అలీమ్, ఖాసిం, జాకీర్, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , దృష్టిలో పెట్టుకొని, తమను భారీ మెజారిటీతో మూడవసారి గెలిపించి, తమ గ్రామ ప్రాంతాలు మరింత అభివృద్ధి చేసుకునే విధంగా గెలిపించాలని ,ప్రజలతో మమేకమై తమ ప్రచారాన్ని వర్షంలోనే కొనసాగించారు. ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.