కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు, మంచినీటి కష్టాలు తప్పవు : లక్ష్మారెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-19 16:07:55.0  )
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు, మంచినీటి కష్టాలు తప్పవు : లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు మంచినీటి కష్టాలు తప్పవని 60 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారని గత పదేళ్ల నుంచి పేదల సంక్షేమమే దేయంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీని మరో మారు ఆశీర్వదించండని బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ లోని 8 వార్డు, 26 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ నూతన మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచానని జడ్చర్ల మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, 100 పడకల ఆసుపత్రి నిర్మించుకున్నామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు. రైతుభీమ, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, బీసీబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్టుతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా చేస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. అధికార దాహంతో కళ్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే గోస పడుతామన్నారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ కావాలో.. 24 గంటల కరెంట్‌ ఇచ్చే బీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.

కాంగ్రెస్‌ 60 ఏండ్ల పాలనలో చాలా వెనకబడ్డామని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా మళ్లీ కారు గుర్తుకు ఓటేసి అధికారం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, వైస్ చైర్మన్ సారిక రామ్మోహన్, కౌన్సిలర్లు ఆలూరి శశి కిరణ్, చైతన్య, చౌహన్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, మూడా డైరెక్టర్లు ప్రీతం శ్రీకాంత్, ఇంతియాజ్,,బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story
null